News February 27, 2025

బాపట్ల జిల్లాలో వారికి మాత్రమే సెలవు

image

ఇవాళ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బాపట్ల జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు గురువారం సెలవు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ వెంకట మురళి ప్రకటన చేశారు. ఈ సెలవు కేవలం బాపట్ల, వేమూరు, రేపల్లె నియోజకవర్గ పరిధిలోని మండలాలకే వర్తిస్తుంది. చీరాల, అద్దంకి, పర్చూరు పరిధిలో స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడుస్తాయి.

Similar News

News March 24, 2025

బాపట్ల: పోలీస్ గ్రీవెన్స‌కు 48 ఫిర్యాదులు

image

సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 48 ఫిర్యాదులు వచ్చినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నేరుగా ఆయన వినతి పత్రాలు స్వీకరించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే చట్ట పరిధిలో విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలన్నారు.

News March 24, 2025

దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బాపట్ల ఎంపీ సమీక్ష 

image

బాపట్ల ఎంపీ, పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ సోమవారం ఢిల్లీలో దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గంలోని 62 లెవెల్ క్రాసింగ్ స్థితిని సమీక్షించారు. ప్రజలు ప్రమాదాలు, అసౌకర్యాలకు గురికాకుండా ఉండటానికి 62 ఆర్ఓబీలు, ఆర్‌యూబీల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరినట్లు ఎంపీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.

News March 24, 2025

పఠాన్‌ కామెంటరీపై నిషేధం..? కారణం అదేనా?

image

మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గత ఏడాది IPLలో కామెంటరీతో అలరించారు. ఈ ఏడాది మాత్రం ఆయన జాడ లేదు. కామెంటరీ నుంచి ఆయన్ను నిషేధించడమే కారణమని సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం.. గతంలో తనతో విభేదాలున్న ఆటగాళ్లపై ఆయన లైవ్ కామెంటరీలోనే పరోక్షంగా విమర్శలు లేదా కామెంట్లు చేస్తుండటం ప్రసారదారులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆయన్ను కామెంటరీ కాంట్రాక్ట్ నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!