News August 10, 2024

బాపట్ల జిల్లాలో 18 మంది ఎస్ఐల బదిలీలు

image

బాపట్ల జిల్లాలో 18 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల పట్టణ ఎస్ఐలుగా విజయకుమార్, చంద్రావతి, వేమూరు- ఎస్సైగా రవికృష్ణ, కొల్లూరు- ఏడుకొండలు, నగరం- భార్గవ్, అమృతలూరు- అమరవర్ధన్, రేపల్లె- మోహన్, చందోలు- స్వామి శ్రీనివాస్‌లను నియమించడంతో పాటు పలువురుని బదిలీ చేశారు. 

Similar News

News September 19, 2025

గుంటూరు రైల్వేస్టేషన్‌లో కొత్త సదుపాయం

image

రాబోయే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రయాణికుల కోసం టిక్కెట్ కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. గుంటూరు స్టేషన్‌లో సిబ్బంది ధరించే జాకెట్ల వెనుక భాగాన క్యూఆర్ కోడ్ అమర్చారు. ప్రయాణికులు యూటీఎస్, రైల్ వన్ యాప్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేసి కాగిత రహిత టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇకపై 5KM లోపు ఇంటి నుంచే జనరల్, ప్లాట్‌ఫామ్, సీజన్ టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం లభిస్తోంది.

News September 19, 2025

గుంటూరు జిల్లా రైతులకు శుభవార్త

image

గుంటూరు జిల్లాలో రైతుల అవసరాల నిమిత్తం తాజా ఎరువుల సరఫరా జరిగింది. గురువారం రెడ్డిపాలెం రైల్వే స్టేషన్ రేక్ పాయింట్‌కు 330 మెట్రిక్ టన్నుల యూరియా వ్యాగన్ల ద్వారా చేరింది. స్టాక్‌ను ఏడీఏ మెహనరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాకు వచ్చిన ఈ సరఫరాలో మార్క్‌ఫెడ్‌కు 250 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్లకు 80 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News September 19, 2025

అసెంబ్లీ మార్షల్స్‌పై మంత్రి లోకేశ్ సీరియస్

image

అసెంబ్లీలో MLAలు, మీడియాపై మార్షల్స్ దురుసు ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. MLA ధూళిపాళ్ల నరేంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా మార్షల్స్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నరేంద్రపై చేయి వేసి నెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడే బయటకు వచ్చిన మంత్రి లోకేశ్ ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.