News January 29, 2025
‘బాపట్ల జిల్లాలో 2024లో 226 మంది చనిపోయారు’

గత 2024 సంవత్సరంలో బాపట్ల జిల్లాలో జరిగిన 500కు పైగా ప్రమాదాలలో సుమారు 226 మంది చనిపోయారని బాపట్ల మోటారు వాహన తనిఖీ అధికారి ప్రసన్న కుమారి చెప్పారు. బుధవారం రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బాపట్లలోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ గ్రౌండ్లో వాహన దారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రమాదాలలో రక్షణ లభిస్తుందన్నారు. సహాయ అధికారి కిషోర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
NZB: ముసాయిదా విత్తన బిల్లు-2025పై అభిప్రాయాల సేకరణ

వ్యవసాయ శాఖ ద్వారా రూపొందించిన ముసాయిదా విత్తన బిల్లు-2025పై అభిప్రాయ సేకరణ జరిపారు. IDOCలో వ్యవసాయ అధికారులతో పాటు రైతు ప్రతినిధులు, విత్తన డీలర్లు, కంపెనీలు, విత్తన ఉత్పత్తిదారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బిల్లులోని అంశాలపై చర్చించారు. ముసాయిదా బిల్లులో పొందుపర్చిన నాసిరకం విత్తనాల కారణంగా పంట ఉత్పత్తి, విక్రయ దశ, నష్టపరిహారం అందించే అంశాలపై చర్చించారు.
News November 28, 2025
ఉంగుటూరు: సభా ప్రాంగణం, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

CM చంద్రబాబు డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మెన్ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి, SP కిషోర్తో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శుక్రవారం గొల్లగూడెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్ స్థలాన్ని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసే ప్రాంతాన్ని పరిశీలించారు.
News November 28, 2025
నిజామాబాద్: విద్యను కార్పొరేట్ ఉత్పత్తి సాధనంగా మార్చాయి

దేశంలో విద్యను కార్పొరేటు ఉత్పత్తి సాధనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చాయని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలు ఆర్మూర్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆర్మూర్లోని హనుమాన్ ఆలయం నుంచి CVR జూనియర్ కళాశాల వరకు వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన, అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.


