News February 27, 2025
బాపట్ల జిల్లాలో 29.29 శాతం పోలింగ్

బాపట్ల జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 24,493 ఓటర్లు ఉన్నారు. ఉదయం 10 గంటలకు 4,787 మంది పురుషులు, 2,386 మంది ఓటు వేశారని జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల వరకు 29.29 శాతం పోలింగ్ జరిగిందన్నారు.
Similar News
News October 23, 2025
సంగారెడ్డి: ప్రవేశాలకు నేడే చివరి గడువు: డీఈఓ

ఉమ్మడి జిల్లాలోనీ వర్గల్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతులలో ప్రవేశం పొందేందుకు గడువు నేటి వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు https://www.navodaya.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 23, 2025
ఆస్ట్రేలియన్ ప్లేయర్ రికార్డు సెంచరీ

ఆస్ట్రేలియన్ ప్లేయర్ గార్డ్నర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. WWCలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచారు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో 69 బంతుల్లోనే 15 ఫోర్లతో శతకం బాదారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఛేదనలో గార్డ్నర్(104*), అన్నాబెల్(98*) విజృంభించడంతో ఆస్ట్రేలియా 40.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
News October 23, 2025
MNCL: మద్యం దుకాణాలకు 1624 దరఖాస్తులు

మంచిర్యాల జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 73 మద్యం షాపులకు గాను బుధవారం వరకు మొత్తం 1624 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ సీఐ గురవయ్య తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 23 వరకు పొడిగించినందున ఆసక్తి ఉన్న వారు సమర్పించాలని సూచించారు. 27న ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు.