News February 27, 2025

బాపట్ల జిల్లాలో 70.78% పోలింగ్ నమోదు

image

బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 4 గంటలకు వరకు 70.78శాతం పోలింగ్ నమోదైనట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గంగాధర్ తెలిపారు. చుండూరు మండలంలో 66.46, అమృతలూరు 74.40, వేమూరు 72, కొల్లూరు 63.33, భట్టిప్రోలు 66.43, చెరుకుపల్లి 72.88, నగరం 63.51, రేపల్లె 67.76, నిజాంపట్నం 68.89, పిట్టలవానిపాలెం 68.88, కర్లపాలెం 71.70, బాపట్ల మండలంలో 71.70శాతం ఓటింగ్ జరిగింది.

Similar News

News December 6, 2025

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

image

గంజాయి అక్రమ రవాణా నిరోధానికి ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పర్వత ప్రాంతాలు, రహదారులు, నిరుపయోగంగా ఉన్న భవనాలను డ్రోన్‌లతో పర్యవేక్షించారు. అనుమానితులను ప్రశ్నించి ఫింగర్ ప్రింట్ డివైస్‌తో తనిఖీలు చేశారు. బహిరంగంగా మద్యపానం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.

News December 6, 2025

నిజామాబాద్: 3వ రోజు 2,975 నామినేషన్లు

image

NZB జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం 2,975 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 608 మంది, 1,620వార్డు మెంబర్ స్థానాలకు 2,367 మంది నామినేషన్లు వేశారు. 3 రోజుల్లో SPలకు 1,077, WMలకు 4,021 నామినేషన్లు వచ్చాయి.

News December 6, 2025

సిరి సంపదలను కలిగించే ‘వ్యూహ లక్ష్మి’

image

శ్రీవారి వక్ష స్థలంలో ‘వ్యూహ లక్ష్మి’ కొలువై ఉంటారు. ఈ అమ్మవారే భక్తుల కోర్కెలు విని శ్రీవారికి చేరవేరుస్తారని పండితులు చెబుతారు. తిరుమల వెళ్లి వ్యూహ లక్ష్మిని దర్శించుకున్నా, ఇంట్లో వ్యూహలక్ష్మిని పూజించినా అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం. శ్రీవారి మూలవిరాట్టుపై అమ్మవారు ఎప్పుడూ పసుపు అచ్చుతో కప్పబడి ఉంటారు. ఆ పసుపును మనం ప్రసాదంగా పొందవచ్చు. ☞ అదెలాగో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.