News January 30, 2025
బాపట్ల జిల్లాలో MLC ఎన్నికలు

బాపట్ల జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది.
* ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్.
* 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు.
* 11న నామినేషన్ల పరిశీలన.
* 13న నామినేషన్ల ఉపసంహరణ.
* 27న ఉదయం 8.నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్.
* మార్చి 3న ఓట్ల లెక్కింపు.
మరోసారి MLC అభ్యర్థిగా KS లక్ష్మనరావు, కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సిద్దమయ్యారు.
Similar News
News December 9, 2025
భారత్లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

ఆసియాలోనే తమ అతిపెద్ద పెట్టుబడి భారత్లో పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇండియాలో AIకి ఊతమిచ్చేలా 17.5 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆయన.. దేశంలో AI అభివృద్ధికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు.
News December 9, 2025
జిల్లాకు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి: ఎంపీ

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని తక్షణమే నిర్మించాలని అమలాపురం ఎంపీ హరీశ్ లోక్సభలో 377 నిబంధన ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో వైద్య సదుపాయాల లోపం, ట్రామా కేంద్రాలు లేకపోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. మంజూరైన క్యాన్సర్ డే సెంటర్ను వేగంగా నిర్మించాలని ఎంపీ కోరారు.
News December 9, 2025
చిత్తూరు: హైవేల అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్

కుప్పం, కాణిపాకం జాతీయ రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. కుప్పం, హోసూర్, బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే, కాణిపాకం టెంపుల్ లింక్ రోడ్డు-NH 140 సంబంధించి కనెక్టివిటీ అంశాన్ని కేంద్రానికి సమర్పించగా ఆమోదం తెలిపినట్టు చెప్పారు. దీంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.


