News January 30, 2025

బాపట్ల జిల్లాలో MLC ఎన్నికలు.. ఎక్కడెక్కడంటే.!

image

బాపట్ల జిల్లాలో MLC ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. అయితే <<15306092>>బాపట్ల జిల్లాలోని<<>> వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, పిట్టలవానిపాలెం మండలాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. కాగా గ్రాడ్యుయేట్ MCLగా ఉన్న KS లక్ష్మణరావు మరోసారి పోటీ చేయనుండగా.. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌తోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు.

Similar News

News November 1, 2025

SRCL: ‘తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి’

image

తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇటీవల మొంథా తుఫాన్‌తో జిల్లాలో జరిగిన నష్టం అంచనాలు రూపొందించడంపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ కారణంగా పాక్షికంగా, పూర్తిగా నష్టపోయిన ఇండ్ల వివరాలను రెవెన్యూ అధికారులు, పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు సమాచారం ఇవ్వాలన్నారు.

News November 1, 2025

సిరిసిల్ల: ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ముగ్గురి అరెస్ట్

image

సిరిసిల్ల పట్టణంలో కత్తులు పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. సుందరయ్య నగర్ సిక్కువాడకు చెందిన బురహాని నర్సింగ్, రాజేష్ సింగ్, బురణి గోపాల్ సింగ్‌లు పెద్ద కత్తులు పట్టుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

News November 1, 2025

వనపర్తి: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్

image

పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ సరైన వేదిక అని వనపర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో కేసులు పెండింగ్ లేకుండా సత్వర పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ నెల 15న నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా ఇరువర్గాలకు అవగాహన కల్పించాలని సూచించారు.