News April 7, 2025

బాపట్ల జిల్లా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ నియామకం

image

బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా న్యాయస్థానంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గవిని శ్రీనివాసరావు నియమితులయ్యారు. సోమవారం బాపట్ల కోర్టు భవనంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన నియమాక పత్రాలను ఆరో అదనపు కోర్టు జడ్జ్ శ్యాం బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా నూతన ఏపీపీని బాపట్ల బార్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలికారు.

Similar News

News December 2, 2025

చైనా మాంజాలపై నిర్మల్ పోలీసుల పంజా

image

జిల్లాలో చైనా మాంజా విక్రయాన్ని నిరోధించేందుకు జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పతంగులు ఎగరేసే సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే చైనా మాంజ వినియోగం, రవాణా, నిల్వ విక్రయాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కిరాణా దుకాణాలు, చిన్నపాటి వ్యాపార కేంద్రాలను సందర్శించి చైనా మాంజ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News December 2, 2025

నల్గొండ: ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్‌కు నోచుకోని గ్రామాలు!

image

నల్గొండ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో స్థానిక సర్పంచ్ ఎన్నికలకు ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నా రిజర్వేషన్ రాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నార్కెట్‌పల్లి, నిడమనూర్, గుండ్రంపల్లి, వెలిమనేడు, పెద్ద కాపార్తి, పెద్దదేవులపల్లి, ముత్యాలమ్మ గూడెం, చందంపేట, పులిచెర్ల, దాచారం , అంగడిపేట, వీర్లపాలెం, పగిడిమర్రి, కొండూరు, ఎర్రగండ్లపల్లి ఇలా దాదాపు 27 పంచాయతీలకు ఒక్కసారి కూడా సర్పంచ్ SC రిజర్వ్ కాలేదు.

News December 2, 2025

ఈజీ మనీ ఆశ ప్రమాదం: వరంగల్ పోలీసుల హెచ్చరిక

image

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని వరంగల్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫ్రీ గిఫ్ట్స్, భారీ డిస్కౌంట్స్ పేరుతో ఎర వేసి మీ ఖాతాలు ఖాళీ చేస్తారని హెచ్చరించారు. ఉచితం అనగానే ఆశపడకుండా ఒక్క క్షణం ఆలోచించాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచించారు.