News September 26, 2024
బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున
బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున నియమిస్తూ.. వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా నందిగం సురేశ్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి నేతలకు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News October 16, 2024
గుంటూరు జిల్లా నిరుద్యోగ యువతకు గమనిక
గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 19న విజయవాడలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు తెలిపారు. డిప్లొమా, డిగ్రీ చదివి, 19-25ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హతలు గల అభ్యర్థులు ముందుగా tinyurl.com/jobdrive-vjdeastలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 15, 2024
కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నరసరావుపేట ఎంపీ
రాష్ట్రంలో CRIF పథకం కింద రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.400 కోట్లు విడుదల చేసిన కేంద్రమంత్రి నితిన్ గట్కారిని మంగళవారం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడులో దుర్గి-వెల్దుర్తి రహదారి, పలువాయి జంక్షన్-సత్రశాల రోడ్డు(వయా) పాశర్లపాడు, జెట్టిపాలెం రహదారికి నిధులు మంజూరైనట్లు ఎంపీ తెలిపారు. కుప్పగంజి వాగు నుంచి వోగేరు వాగు వరకు డ్రైన్ల నిర్మాణం కోసం గ్రాంట్ విడుదల చేయాలని కోరారు.
News October 15, 2024
గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు.. గడ్కరీకి చంద్రబాబు కృతజ్ఞతలు
గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.98 కోట్లు కేంద్ర మంత్రి గడ్కరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో గడ్కరి చేసిన ప్రకటన ఎన్నో ఏళ్ల గుంటూరు వాసుల కల నెరవేర్చనుంది.