News January 26, 2025
బాపట్ల జిల్లా ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా రాజేశ్

బాపట్ల జిల్లా ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా జిల్లా మైన్స్, జియాలజీ అధికారి రాజేశ్ కుమార్ అవార్డు అందుకున్నారు. బాపట్లలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. విధులలో ఉత్తమ పనితీరు కనబర్చడంతో బాపట్ల జిల్లాలో మూడవసారి ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి అవార్డు అందుకున్నట్లు రాజేశ్ తెలిపారు.
Similar News
News October 16, 2025
KNR: 20 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. రాష్ట్ర DGP ఆదేశాల మేరకు విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల 20 నుంచి 31 వరకు ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల’ను ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీ పేర్కొన్నారు.
News October 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 16, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.16 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.06 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 16, 2025
పాలమూరు: GREAT.. తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు!

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాపూర్ వాసి వేముల శ్రీనివాసులు(42) హైదరాబాద్లో మేస్త్రీ పని చేస్తూ ఈనెల 10వ తేదీన మూడో అంతస్తు నుంచి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య అతడి అవయవాలు దానం చేసేందుకు ఒప్పుకున్నారు. దీంతో కాలేయం, గుండె, కిడ్నీలు, కార్నియాస్ను ఆరుగురికి దానం చేశారు.