News March 27, 2025
బాపట్ల: జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన డీఆర్డీఏ పీడీ

బాపట్ల జిల్లా నూతన డీఆర్డీఏ పీడీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు గురువారం బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వెంకట మురళికి పుష్పగుచ్చం అందజేశారు. తనకు కల్పించిన అవకాశాన్ని జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తానని ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌కు హామీ ఇచ్చారు.
Similar News
News April 17, 2025
ప్రొద్దుటూరులో ఒకేరోజు 60 తులాల బంగారం చోరీ.. 18 కేజీల పసిడి పట్టివేత

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒకేరోజు రెండు సంఘటనలు జరిగాయి. స్థానిక బొల్లవరం నరాల బాలిరెడ్డి కాలనీలో యెనమల చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులెవ్వరూ లేని సమయంలో 60 తులాల బంగారం చోరీ జరిగింది. మరోవైపున స్థానిక రామేశ్వరం బైపాస్ రోడ్డులో వాహన తనిఖీల్లో పోలీసులు ఒక కారులో రికార్డులు లేని 18 కేజీల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు.
News April 17, 2025
మంత్రి వివాదాస్పద కామెంట్స్.. FIR ఫైల్ చేయాలని కోర్టు ఆదేశం

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన TN మంత్రి కె.పొన్ముడిపై ఈనెల 23లోపు FIR నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. లేదంటే తామే ఈ కేసును సమోటోగా స్వీకరిస్తామని స్పష్టం చేసింది. ఓ సెక్స్ వర్కర్ తమ వద్దకు వచ్చిన వారిని శైవులా, వైష్ణవులా అని అడిగిందంటూ ఆయన అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో పొన్ముడిని డీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించింది.
News April 17, 2025
జనసేనలో చేరిన విశాఖ వైసీపీ కార్పోరేటర్లు

విశాఖలో మరోసారి YCPకి ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు కార్పోరేటర్లు గురువారం జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ వారికి కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. విశాఖ సౌత్ MLA వంశీ కృష్ణ ఆధ్వర్యంలో 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు చేరారు. 91, 92 డివిజన్ల కార్పొరేటర్లు జ్యోత్స్న, బెహరా స్వర్ణలత సైతం జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు.