News April 15, 2025
బాపట్ల జిల్లా డీఆర్డీఏ ఇన్ఛార్జి పీడీ నియామకం

బాపట్ల జిల్లా డీఆర్డీఏ ఇన్ఛార్జి పీడీగా సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా డీఆర్డీఏ పీడీగా కొనసాగుతున్న శ్రీనివాస్ ట్రైనింగ్ నిమిత్తం వారం రోజులు సెలవు పై వెళ్ళారు. ఆయన స్థానంలో ఇన్ఛార్జి పీడీగా సుబ్బారావును నియమిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News December 16, 2025
గుంటూరు యార్డులో ‘ఘాటు’.. ఎల్లో మిర్చి @ రూ.280

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 60 వేల బస్తాల ఏసీ సరుకు పోటెత్తింది. మార్కెట్లో ఎల్లో రకం మిర్చి రికార్డు స్థాయిలో కిలో రూ.200 నుంచి రూ.280 పలికింది. ముఖ్యంగా 2043 ఏసీ రకం గరిష్టంగా రూ.200, నాటు సూపర్-10 రూ.180, నంబర్-5 రూ.175 వరకు అమ్ముడయ్యాయి. ప్రధాన రకమైన తేజా ఏసీ రూ.120-149, 355 రకం రూ.170, బుల్లెట్ రూ.165 పలికాయి. మీడియం సీడు రకాలు రూ.90-110, తాలు రకాలు రూ.60-90 మధ్య ధర పలికాయి.
News December 16, 2025
మండపేట: వేగుళ్లకి తోట త్రిమూర్తులు సవాల్

మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కేవలం అవకాశవాది మాత్రమేనని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ ఛైర్మన్, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. మండపేట వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేది మేడిపండు నైజమని వ్యాఖ్యానించారు. ఆయనతో బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.
News December 16, 2025
జగిత్యాల: ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

ఈనెల17న జరగనున్న పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. 6 మండలాల్లో జరుగునున్న పోలింగ్ కేంద్రాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది బాధ్యతలు పంపిణీ,లాజిస్టిక్ ఎన్నికల మెటీరియల్ను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు 1306 మంది పిఓలు, 1706 ఏపిఓ సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.


