News March 22, 2025
బాపట్ల జిల్లా పోలీసులకు పురస్కారాల వెల్లువ

బాపట్ల జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహించే 12 మంది ఉగాది పురస్కారాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్కి ఉత్తమ సేవా పథకం, బాపట్ల డీఎస్పీ రామాంజనేయులుకు మహోన్నత సేవా పథకం, సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, అడ్మిన్ ఆర్.ఐ మౌలుద్దీన్లకు సేవా పథకాలు, జిల్లాలో 7 గురికి సేవా, ఒకరికి ఉత్తమ సేవా పతకాలు వచ్చాయని ఎస్పీ చెప్పారు.
Similar News
News November 19, 2025
వరంగల్ కలెక్టర్కు మంత్రి పొంగులేటి అభినందనలు

జల సంరక్షణ కేటగిరీ-2లో వరంగల్ జిల్లా అవార్డు సాధించి, ఢిల్లీలో అవార్డు స్వీకరించిన నేపథ్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఐఏఎస్ను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో కాసేపు చర్చించారు.
News November 19, 2025
ASF: ఇండ్ల పనులు వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను వేగవంతం చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. ASF జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతి, ఇంటి పన్నుల వసూలు, ఉపాధి హామీ పనులపై మాట్లాడారు.
News November 19, 2025
భద్రకాళి ఆలయ హుండీ ఆదాయం రూ. 65.93 లక్షలు

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో బుధవారం హుండీలు విప్పి లెక్కింపు చేశారు. ఈ లెక్కింపులో మొత్తం రూ. 65,93,481 ఆదాయం వచ్చింది. వీటితో పాటు 2483 యూఎస్ఏ డాలర్లు, 55 ఆస్ట్రేలియా డాలర్లు సహా ఇతర విదేశీ కరెన్సీలు లభించాయి. హుండీలో వచ్చిన మిశ్రమ బంగారం, వెండిని తిరిగి హుండీలో వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, అధికారులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.


