News April 13, 2025
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS రద్దు- ఎస్పీ

బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదివారం ప్రకటించారు. సోమవారం అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు అందజేసేందుకు కార్యాలయానికి రావద్దని సూచించారు.
Similar News
News February 11, 2026
KNR: మరి కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. కరీంనగర్‌లో 66 డివిజన్లకు 398 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 476 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 467 డివిజన్‌లకు సంబంధించి, కరీంనగర్‌లో 4,18,434, జగిత్యాలలో 2,31,555, పెద్దపల్లిలో 2,58,030, రాజన్న సిరిసిల్లలో 1,22,812 మంది ఓటర్లు ఉన్నారు.
News February 11, 2026
బడ్జెట్ సమావేశాలకు అనంతపురం ఎమ్మెల్యేలు సిద్ధం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని సాగునీరు, తాగునీటి సమస్యలతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులు, హంద్రీ-నీవా కాల్వల ఆధునీకరణ, ఆసుపత్రులు, రోడ్ల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై ప్రజాప్రతినిధులు గళమెత్తాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
News February 11, 2026
పిఠాపురం: అభివృద్ధి సంక్షేమం పరుగు..ర్యాంకులో వెనకడుగు

Dy.Cm పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురాన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రానికి మోడల్‌గా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ కమిటీల్లో కూడా పారదర్శకత చూపించారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్‌లో పిఠాపురం 10వ స్థానానికి పరిమితమైంది. 91 స్కోరింగ్‌తో A+ గ్రేడ్ ఉన్నా 10కి పడిపో వడానికి కారణం ఏమిటన్న చర్చ సాగుతోంది.


