News January 27, 2025
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

బాపట్ల జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. రాజ్యాంగ ముసాయిదా రచించిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలుపరిచారని, తద్వారా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నట్లు వివరించారు.
Similar News
News January 16, 2026
మేడారం జాతర.. 3 రోజులు సెలవులకు డిమాండ్

TG: మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. 4 రోజుల పాటు జరిగే ఈ గిరిజన జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పేర్కొంది. ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో అత్యంత వైభవంగా జాతర జరగనుంది.
News January 16, 2026
జిల్లాలోనే మాజీ ఉపరాష్ట్రపతి

మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పండుగ సందర్భంగా జిల్లాలోని ఆయన స్వస్థలం వెంకటాచలం మండలంలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఆయనను పలువురు ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిరువురు జిల్లా పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు.
News January 16, 2026
శ్రీకాకుళం జిల్లా మీదగా అమృత్ భారత్ స్లీపర్ ట్రైన్..రేపట్నుంచే

రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. న్యూజల్ పాయ్ గురి నుంచి శ్రీకాకుళం మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురిలో 1:45కు బయలదేరి మరుసటి రోజు సోంపేట-10:44, ఇచ్ఛాపురం-11:01, పలాస-11:46, శ్రీకాకుళం-12:38గంటలకు చేరుకుంటుంది.


