News March 25, 2025
బాపట్ల: జిల్లా ప్రజలారా.. ఇవాళ జాగ్రత్త!

బాపట్ల జిల్లాలోని పలు మండలాలలో మంగళవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదై వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. నిజాంపట్నం 34.8, సంతమాగులూరు 38.1, చుండూరు 37.1, బల్లికురవ 37.1, అమృతలూరు 37, భట్టిప్రోలు 36.5, చెరుకుపల్లి 36, ఇంకొల్లు 35, కొల్లూరు 37.1, మార్టూరులో 36.7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆయా మండలాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News October 21, 2025
జనగామ: పంట కల్లాలకు మోక్షం ఎప్పుడో!

ధాన్యం దిగుబడి వచ్చిన రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కల్లాలు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పొలాలు, రహదారులపై ఆరబోసుకుంటున్నారు. జిల్లాలో రెండు లక్షలకు పైగా రైతులంటే కేవలం 4 వేల పంట కల్లాలు ఉండటం గమనార్హం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంట కల్లాల నిర్మాణం చేపట్టాలని జిల్లాల్లోని రైతులు కోరుతున్నారు.
News October 21, 2025
అమెరికన్లకు ట్రంప్ దీపావళి విషెస్

ప్రపంచ దేశాధినేతలు సైతం హిందువులనుద్దేశించి దీపావళి విషెస్ చెబుతారు. అయితే US అధ్యక్షుడు ట్రంప్ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి అమెరికన్‌కు విషెస్ తెలియజేశారు. ఈ పండుగ కుటుంబాలను, స్నేహితులను, కమ్యూనిటీలను ఏకం చేసి నమ్మకాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అయితే హిందువులు, ఇండియన్స్‌ను విష్ చేయకుండా ట్రంప్ బుద్ధి చూపిస్తున్నాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
News October 21, 2025
వరంగల్: ఆకతాయిలు వేధిస్తే సమాచారం ఇవ్వండి!

మహిళలు, విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత కోరారు. WGL ములుగు రోడ్డులోని ఓ ప్రవైయిట్ వస్త్రాలయంలోని ఉద్యోగులకు డయల్ 100, సైబర్ క్రైమ్, టీసేవ్ యాప్‌తో పాటు షీ టీం సేవలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండొద్దని, 8712685142కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు ఇన్స్పెక్టర్ సూచించారు.