News February 9, 2025

బాపట్ల జిల్లా ప్రజలు జాగ్రత్త..!

image

బాపట్ల జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న బాపట్ల జిల్లాలో గరిష్ఠంగా 33.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా నీరు, కొబ్బరి నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Similar News

News February 11, 2025

హెలికాప్టర్ ద్వారా భూ సర్వే నిర్వహించిన వరంగల్ కలెక్టర్

image

WGL జిల్లాలో హెలికాప్టర్ ద్వారా డిజిటల్ ఏరియల్ భూ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను KZPT నుంచి కలెక్టర్ సత్య శారద హెలికాప్టర్‌లో వర్ధన్నపేటకు బయల్దేరి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ‘నక్ష’ ప్రాజెక్టులో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని చెరువులు, కాల్వలు తదితర వివరాలతో అక్షాంశాలు, రేఖాంశాలుగా సంబంధిత ప్రాంతాన్ని నమోదు చేస్తారన్నారు. మంగళవారంలోగా సర్వే పూర్తవుతుందని పేర్కొన్నారు.

News February 11, 2025

వరంగల్: హెలికాప్టర్ ద్వారా భూ సర్వే నిర్వహించిన కలెక్టర్

image

WGL జిల్లాలో హెలికాప్టర్ ద్వారా డిజిటల్ ఏరియల్ భూ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను KZPT నుంచి  కలెక్టర్ సత్య శారద హెలికాప్టర్‌లో వర్ధన్నపేటకు బయల్దేరి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ‘నక్ష’ ప్రాజెక్టులో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని చెరువులు, కాల్వలు తదితర వివరాలతో అక్షాంశాలు, రేఖాంశాలుగా సంబంధిత ప్రాంతాన్ని నమోదు చేస్తారన్నారు. మంగళవారంలోగా సర్వే పూర్తవుతుందని పేర్కొన్నారు.

News February 11, 2025

నాలుగు లేన్లుగా కరకట్ట రోడ్డు!

image

AP: విజయవాడ నుంచి రాజధాని అమరావతి వెళ్లేందుకు ప్రస్తుతమున్న కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. దాదాపు అలైన్‌మెంట్ పూర్తి కాగా త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం భూసేకరణ/భూసమీకరణ చేయాలా? అనే దానిపై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా నది వరదలను తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేయనున్నారు.

error: Content is protected !!