News February 9, 2025
బాపట్ల జిల్లా ప్రముఖ గాయని మృతి

బాపట్ల మండలం నరసాయపాలేనికి చెందిన ప్రముఖ గాయని కారుమంచి కోటిరాజ్(88) శనివారం మృతి చెందారు. ఈమె సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేశారు. ఈమె ఏడేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారు. సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఆమె పలు సినిమాలకు పాటలు కూడా పాడారు. బాపట్ల జమేదారుపేటలో 27ఏళ్ల క్రితం స్థిరపడి సప్తస్వర సంగీత కళాశాల ఏర్పాటు చేసి, అనేకమందికి సంగీతం నేర్పించారు.
Similar News
News February 17, 2026
పెద్దపల్లి: వృద్ధురాలి హత్య.. నిందితుడికి ‘జీవిత ఖైదు’.!

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన సంపత్ రావుకు వృద్ధురాలి హత్య కేసులో జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సునీత మంగళవారం తీర్పునిచ్చారు. 2019లో చంద్రమ్మ అనే వృద్ధురాలిని పీటతో కొట్టి చంపి, ఆమె బంగారు గొలుసు ఎత్తుకెళ్లినట్లు సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను రామగుండం సీపీ అభినందించారు.
News February 17, 2026
VZM: ‘గనుల లీజుకు త్వరగా అనుమతులు’

నిబంధనలను పరిశీలించిన అనంతరం గనుల లీజుకు వీలైనంత త్వరగా అనుమతులు జారీ చేస్తామని JC సేధు మాధవన్ చెప్పారు. సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆద్వర్యంలో వీసీ నిర్వహించారు. గరివిడి మండలం మందిరవలస, చీపురుపల్లి మండలం నిమ్మలవలస, నెల్లిమర్ల మండలం జగ్గిరాజుపేట గనుల కోసం వివరించి NOC మంజూరు చేస్తామని తెలిపారు.
News February 17, 2026
మైక్రో ఇరిగేషన్ పథకంపై మరింత అవగాహన అవసరం: కలెక్టర్

ఏలూరు జిలాల్లో మైక్రో ఇరిగేషన్ పథకంపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం మాట్లాడుతూ.. డ్రిప్, స్ప్రింక్లర్లు 8,500 హెక్టార్లలో ఏర్పాటు చేయాలని నిర్దేశించగా ఇప్పటి వరకు 6,268 హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు కావడంపై అధికారులపై మండిపడ్డారు. అటు రైతులంతా డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


