News March 23, 2025
బాపట్ల జిల్లా యువతకు ముఖ్య గమనిక

అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందాలని కలెక్టర్ వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసక్తిగల యువకులు ఏప్రిల్ 10వ తేదీలోపు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. నియామక వివరాలనుపై వెబ్సైట్లో తెలుసుకోవచ్చునని, ఈ అవకాశాన్ని అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 3, 2025
ఏపీలో సమగ్ర క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేక చర్యలు: MP సానా

ఏపీలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎంపీ సానా సతీష్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో క్యాన్సర్ పై మాట్లాడరని ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆయుష్ శాఖ మంత్రి క్యాన్సర్ నివారక చికిత్సలు వాటికి సంబంధించి ఏపీలో జరుగుతున్న విధానాన్ని తెలియజేశారని కార్యాలయం వెల్లడించింది. ఆయుష్కు ఆధునిక వైద్యాన్ని ముడిపెట్టి చికిత్సలు అందిస్తారన్నారు.
News December 3, 2025
VKB: లైన్ మెన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష: ఎస్పీ

కరెంట్ షాక్‌తో యువకుని మృతికి కారణమైన విద్యుత్ శాఖ లైన్మెన్కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా జడ్జి శ్రీనివాస్ రెడ్డి శిక్ష ఖరారు చేశారు. 2020లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్ దేవరంపల్లిలో లైన్మెన్ అబ్దుల్ జలీల్, ఎల్సీ (Line Clear) తీసుకోకుండా నిర్లక్ష్యంగా కుషా రెడ్డిని కరెంట్ పోల్‌పైకి ఎక్కించి మృతికి కారణమవడంతో ఈ శిక్ష పడినట్లు ఎస్పీ తెలిపారు.
News December 3, 2025
చిన్న తప్పుతో రూ.లక్షలు కోల్పోతున్నారు!

సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌తో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ‘FLAT SIP’ హ్యాబిట్‌తో రూ.లక్షలు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. ‘ఎప్పుడూ ఒకే అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయకూడదు. పెట్టుబడి మొత్తంలో ఏడాదికి కనీసం 10% పెంచాలి. Ex: నెలకు ₹10వేలు చొప్పున 20ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే (12% రిటర్న్స్‌తో) ₹99 లక్షలొస్తాయి. అదే ఏటా 10% పెంచుకుంటూ పోతే ₹1.5కోట్ల వరకు వస్తాయి’ అని వివరిస్తున్నారు.


