News August 25, 2024
బాపట్ల జిల్లా యువతికి ఐదు కంపెనీల్లో ఉద్యోగాలు

బాపట్ల జిల్లా బొమ్మనంపాడుకు చెందిన శ్రావణికి ఒకేసారి 5 కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. గుంటూరులో ఇంటర్ చదివి పెదకాకానిలోని ఓ కాలేజీలో CSEలో చేరింది. బీటెక్ చివరి ఏడాదిలో తొలిసారిగా ఓ కంపెనీలో రూ.4.5లక్షలు, 2వ కంపెనీలో రూ.5 లక్షలు, 3వ కంపెనీలో రూ.9లక్షలు, 4వ కంపెనీలో రూ.11లక్షలు, 5వ కంపెనీలో రూ.23లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొంది ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది.
Similar News
News December 18, 2025
గుంటూరు: కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, వేగంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, కట్టుబడి ఉన్నామన్నారు.
News December 18, 2025
అమరావతి: పేరుకే రాజధాని.. అంబులెన్స్ రావాలంటే కష్టమే!

అమరావతి రాజధాని ప్రాంతంలో అంబులెన్స్ కొరత తీవ్రంగా వెంటాడుతుంది. రాజధాని ప్రాంతంలో రోజూ ఏదొక ప్రమాదం జరుగుతూ ఉన్నా అంబులెన్స్ మాత్రం అందుబాటులో ఉండకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. దీనికి ఉదాహరణ బుధవారం రాత్రి రాయపూడిలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందడం. అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే గుంటూరు, మంగళగిరి నుంచి రావడానికి గంటకు పైగా పడుతుందని స్థానికులు అంటున్నారు.
News December 18, 2025
GNT: ఈ సీజన్‌కి అయినా యార్డ్ ఛైర్మన్ పోస్ట్ భర్తీ అయ్యేనా?

గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్ విషయంలో ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. వచ్చే నెల నుంచి ప్రారంభమవనున్న మిర్చి సీజన్లో యార్డులో కోట్ల రూపాయల లావాదేవీలు జరగనున్నాయి. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఛైర్మన్ పదవిని భర్తీ చేయకపోవడంతో సొంత పార్టీ నాయకులే నైరాశ్యంలో ఉన్నారని పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆశావహులు మాత్రం ఈ సీజన్‌కి పదవి భర్తీ ఉంటుందని ఆశిస్తున్నారు.


