News February 23, 2025
బాపట్ల జిల్లా విద్యుత్ వినియోగదారులకు గమనిక

కరెంట్ బిల్లు చెల్లించుటకు బాపట్ల జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కేంద్రాలలోని కౌంటర్లు ఆదివారం తెరిచే ఉంటాయని, బాపట్ల విద్యుత్ శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించనివారు నేడు బిల్లులను చెల్లించాలని కోరారు.
Similar News
News December 6, 2025
చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు: అనంత వెంకటరామిరెడ్డి

రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు.. రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు. ఒక్క వార్నింగ్ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని, కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగిరెద్దులా తలూపుతున్నారని మండిపడ్డారు.
News December 6, 2025
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా జడ్జి శ్రీవాణి

డిసెంబర్ 21, 2025న నిర్మల్ జిల్లాలో జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు అవసరమైన ఏర్పాట్లపై శనివారం నిర్మల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల తదితరులు పాల్గొన్నారు.
News December 6, 2025
కరీంనగర్: అంబేడ్కర్కు బండి సంజయ్ నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ.. దేశాభివృద్ధికి ఆయన అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.


