News March 17, 2025
బాపట్ల జిల్లా వ్యాప్తంగా 234 మంది విద్యార్థులు గైర్హాజరు

పదవ తరగతి పరీక్షలు బాపట్ల జిల్లాలో మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 103 పరీక్షా కేంద్రాలలో మొత్తం 16481 మంది విద్యార్థులకు గాను 16247 మంది విద్యార్థులు హాజరయ్యారు. 234 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా పర్యవేక్షణ అధికారిణి మతి గంగాభవాని తెలిపారు. మొత్తం పరీక్షలకు 98.5 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
Similar News
News November 20, 2025
చేవెళ్ల: ఎర్ర నీళ్లతో వీధి కుక్కలకు చెక్ పెట్టే ఆలోచన

వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కాలనీ వాసులు వినూత్న ఆలోచన చేశారు. ఎర్ర నీళ్లను ఖాళీ వాటర్ బాటిళ్లలో నింపి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఎర్ర నీళ్లను చూసి వీధి కుక్కలు ఇంటి దగ్గరకు రాకుండా రోడ్డుపై ఉంటున్నాయని కాలనీవాసులు తెలిపారు. వీధి కుక్కల బెడద కోసం ఎర్రనీళ్ల ఆలోచన బాగుందని పలువురు చర్చించుకుంటున్నారు.
News November 20, 2025
GWL: ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి- కురువ పల్లయ్య

స్టూడెంట్ను మోకాళ్లపై నడిపించి గాయాలు అయ్యేందుకు కారణమైన వడ్డేపల్లి మండలంలోని శారద విద్యానికేతన్ గుర్తింపును రద్దు చేయాలని BRSV గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. గురువారం గద్వాలలో మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో వేలకు వేలు ఫీజు చెల్లించి, విద్యాబుద్ధులు నేర్పమని పంపితే అనాగరికంగా విద్యార్థులను ఇబ్బందికి గురి చేయడమేంటంటూ ప్రశ్నించారు.
News November 20, 2025
వరంగల్: పోలీస్ సిబ్బందికి రేపు ఉచిత వైద్య శిబిరం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రేపు (శుక్రవారం) ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రముఖ వైద్య నిపుణుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ (సీపీ) సన్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.


