News April 9, 2025

బాపట్ల జిల్లా DCHS బాధ్యతల స్వీకరణ

image

బాపట్ల జిల్లా హాస్పిటల్స్ కోఆర్డినేటర్‌గా మోజేష్ కుమార్ నియమితులయ్యారు. బుధవారం బాపట్ల జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో DCHSగా పనిచేసిన శేషు కుమార్ కృష్ణాజిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నూతన డీసీహెచ్‌గా మోజేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

Similar News

News October 23, 2025

నక్కపల్లి: రేపు రాజయ్యపేటలో పర్యటించనున్న కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ నెల 24న రాజయ్యపేటలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని నక్కపల్లి తహసిల్దార్ నరసింహా మూర్తి బుధవారం తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని మత్స్యకారులు గ్రామంలో రిలే దీక్షలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈనెల 19న గ్రామానికి వస్తానని కలెక్టర్ సమాచారం ఇచ్చారు. అయితే సమయం తక్కువగా ఉన్నందున మరో రోజు రావాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు.

News October 23, 2025

MBNR: జర్మనీలో ఉద్యోగాలు.. రేపు శిక్షణ

image

MBNR ప్రభుత్వ ఐటిఐ బాలుర క్యాంపస్‌లోని ఏటీసీ భవనంలో జర్మన్ భాషా శిక్షణ(A2 స్థాయి శిక్షణ) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శాంతయ్య Way2Newsతో తెలిపారు. ఈ శిక్షణ రేపు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(TOMCOM) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, జర్మనీలో ఉద్యోగాలు, ప్రయోజనాల గురించి వివరిస్తామని, ఎలక్ట్రిషన్ ట్రేడ్ లో 60% మార్కులు ఉండాలని, వయస్సు 19-30లోపు ఉండాలన్నారు.

News October 23, 2025

బాడీలోషన్నే ముఖానికి వాడుతున్నారా?

image

చర్మానికి తేమను అందించడానికి చాలామంది బాడీలోషన్ వాడుతుంటారు. కానీ కొంతమంది ఈ లోషన్నే ఫేస్​కి కూడా వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇందులో వాడే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణం అవుతుందంటున్నారు. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.