News March 14, 2025
బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

◆ పర్చూరు అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే ఏలూరి◆ఉపాధి కూలీలు అపోహలు పడవద్దు: కొరిశపాడు ఏపీవో◆వేటపాలెం: అక్రమ మద్యం స్వాధీనం◆కొల్లూరు: మట్టి రోడ్డుకు అభివృద్ధి పనులు◆సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యం: ఎమ్మెల్యే ఏలూరి◆వారంలో ఒకరోజు గ్రామ పర్యటన: వేగేశన◆కారంచేడు: లంపి వైరస్‌తో ఆవులు విలవిల◆మాణిక్యవేల్ మృతి బాధాకరం: వేమూరు ఎమ్మెల్యే◆సింగరకొండ దేవాలయ స్పెషాలిటీ ఇదే..!
Similar News
News December 8, 2025
మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పనిచేయాలంటే?

* ఫ్రిజ్ కంపార్ట్మెంట్ టెంపరేచర్‌ను 4°C, ఫ్రీజర్‌ను -18°C వద్ద మెయింటేన్ చేయండి.
* వేడి కంటైనర్లను నేరుగా లోపల పెట్టవద్దు.
* సరిగ్గా డోర్ వేయండి. పదేపదే డోర్ తెరవొద్దు.
* ఫ్రిజ్ కాయిల్స్, లోపలి భాగాలను తరచూ క్లీన్ చేయండి.
* ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్థలాన్ని ఉంచండి.
* ఫ్రిజ్ చుట్టూ కనీసం 10CM స్థలాన్ని వదలండి.
* ఒవెన్స్, డిష్ వాషర్స్, డైరెక్ట్ సన్‌లైట్‌కు దూరంగా ఫ్రిజ్‌ను ఉంచండి.
News December 8, 2025
బాపట్ల: అర్జీలు స్వీకరించిన కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అధికారులు పూర్తిస్థాయిలో విచారించి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు అర్జీలను అందజేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
News December 8, 2025
పల్నాడు: కార్తీక మాసం తర్వాత తగ్గిన బంతిపూల ధర

కార్తీక మాసం కాంతులు తగ్గగానే పల్నాడు జిల్లాలోని పూల మార్కెట్లలో బంతిపూల ధర పడిపోయింది. కార్తీక మాసంలో కిలో బంతిపూల ధర రూ. 70 నుంచి రూ. 80 వరకు పలకగా, ప్రస్తుతం రూ. 30 నుంచి రూ. 40 కంటే ఎక్కువ ధర పలకడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా ఆశించిన ఫలితం రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.


