News March 17, 2025

బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

image

★బాపట్ల జిల్లా వ్యాప్తంగా 234 మంది విద్యార్థులు గైర్హాజరు★పిట్టలవానిపాలెం: సైనికుడి కుటుంబానికి 1.25 లక్షల సాయం★భట్టిప్రోలు: చేనేతకు రూ.2 వేల కోట్లు కేటాయించాలి★బాపట్ల: ఎన్టీఆర్ సేవా మిత్రల నిరసన★బాపట్ల: సారా నిర్మూలనకు నవోదయం 2.0 ప్రారంభం★బాపట్ల: వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిరసన★పర్చూరు: Way2Newsతో టెన్త్ విద్యార్థులు★బాపట్ల: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య

Similar News

News December 9, 2025

సంగారెడ్డి: నేటి నుంచి వైన్స్ దుకాణాల బంద్

image

జిల్లాలో ఈనెల 11న జరుగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేటి సాయంత్రం నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్‌లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 9, 2025

ఖమ్మం: సాయంత్రం నుంచి అంతా గప్ చుప్

image

జీపీ మొదటి విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెర పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో 172, కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో 159 గ్రామాల్లో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడూ పెద్దగా కనిపించని బడా నేతలు సైతం ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావించి తమ మద్దతు దారుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.

News December 9, 2025

సిద్దిపేట: పొలంలో ఎన్నికల ప్రచారం

image

సిద్దిపేట జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎలక్షన్‌లో భాగంగా అభ్యర్థులు ఎవరికీ తోచినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేటలో సర్పంచ్ అభ్యర్థి బెదురు తిరుపతి వ్యవసాయ క్షేత్రంలో కూలీలు వారి నాటు వేస్తున్నారని తెలుసుకుని పొలం దగ్గరకి వెళ్లి మరి నేను సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాను. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.