News March 24, 2025
బాపట్ల జిల్లా TODAY TOP HEADLINES

◆ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్◆క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు: బాపట్ల ఎస్పీ◆బాపట్ల: పోలీస్ గ్రీవెన్స్ కు 48 ఫిర్యాదులు◆దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బాపట్ల ఎంపీ సమీక్ష◆బాపట్ల: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు◆వేటపాలెం: టీడీపీలో చేరిన కాంగ్రెస్ కుటుంబాలు
Similar News
News October 27, 2025
పంట కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

TG: ‘మొంథా’ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వర్ష సూచనల దృష్ట్యా పంటల కొనుగోళ్లపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని.. రైతులకు నష్టం జరగకుండా, ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.
News October 27, 2025
SRCL: లక్కీ డ్రా ప్రారంభించిన ఇన్ఛార్జ్ కలెక్టర్

సిరిసిల్ల కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం మద్యం షాపుల లక్కీ డ్రా కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.
News October 27, 2025
DRC వద్ద మూడంచెల భద్రత.. ఎలా అంటే?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం యూసుఫ్గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో DRC సెంటర్ వద్ద ఎన్నికల అధికారులు మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. మెయిన్గేటు వద్ద కొందరిని, రెండోగేటు వద్ద ఇంకొందరిని, స్టేడియం లోపల ఇంకొందరిని భద్రత కోసం వినియోగిస్తారు. ఇందుకోసం ముగ్గురు ఏసీపీలు, ఏడుగురు ఇన్స్పెక్టర్లతోపాటు ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఉంటారు. వీరితోపాటు సాయుధ బలగాలు ఉంటాయి.


