News March 28, 2025

బాపట్ల: టెడ్డీబేర్ వేషంతో హల్‌చల్

image

టెడ్డీబేర్ వేషంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెడ్డీబేర్ వేషం వేసుకుని ఓ వ్యక్తి బాపట్ల పట్టణంలోని సూర్యలంక రహదారిలో కళాశాల వద్ద ప్రజలను ఇబ్బందులకు గురి చేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు వీడియోలు తీస్తున్న మరో ఇద్దరిని స్టేషన్‌కు తరలించారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.

Similar News

News December 4, 2025

సూర్యాపేట: ఏడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం

image

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. సర్పంచ్ పదవులకు 471 మంది, వార్డులకు 2,736 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఏడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అవి కాకుండా 193 వార్డుల స్థానాలకు ఒకటే నామినేషన్ ఉండడంతో ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తులతో అభ్యర్థులు గురువారం నుంచి ప్రచారానికి వెళ్లనున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది.

News December 4, 2025

OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

image

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.

News December 4, 2025

శాలౌగారారం: కాంగ్రెస్‌లో చేరి సర్పంచ్‌గా ఏకగ్రీవం

image

SLG సర్పంచి ఏకగ్రీవ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 13 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో 11మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా చివరికి కాంగ్రెస్, BRS సానుభూతిపరులు ఒక్కొక్కరు మాత్రమే బరిలో నిలిచారు. చివరి క్షణంలో BRS మద్దతుదారు గుజిలాల్ శేఖర్ బాబు కాంగ్రెస్‌లో చేరి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదృష్టం అంటే ఈయనదే మరి. ఏమంటారు మీరు.