News February 21, 2025

బాపట్ల: డిప్యూటీ సీఎం ఫొటోలు మార్ఫింగ్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలను సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై బాపట్ల జనసేన నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం జనసేన నాయకురాలు జిడుగు మాధురి పట్టణ సీఐ రాంబాబును కలిసి మార్ఫింగ్ చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సీఐ రాంబాబు తెలిపారు.

Similar News

News February 28, 2026

’60 ఏళ్ల స్నేహం’ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కంటతడి

image

రాజుపాలెం (M)లోని కొర్రపాడు గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు కమాలుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొర్రపాడు గ్రామానికి చేరుకుని కమాలుద్దీన్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కమాలుద్దీన్‌తో 60 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ “మంచి మిత్రుడిని కోల్పోయాను” అని కంటతడి పెట్టారు.

News February 28, 2026

కృష్ణా: అమ్మో 1వ తారీఖా.. దొరికితే ఇక అంతే..!

image

విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం పట్టణాల్లో ట్రాఫిక్ పోలీసులు టార్గెట్ల పేరుతో ఎడాపెడా ఫైన్లు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హెల్మెట్, లైసెన్స్ లేవనే నెపంతో నెలాఖరు వరకు వసూళ్ల పర్వం సాగుతోందని వాహనదారులు వాపోతున్నారు. ఫైన్ డబ్బులు ప్రభుత్వ ఖజానాకే కాకుండా, కొందరు సొంత ఫోన్ పే నంబర్లకు మళ్లించుకుంటున్నారని టాక్. డబ్బులు కట్టకపోతే అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.

News February 28, 2026

సిద్ధవటంలో చిరుత సంచారం

image

సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు.