News April 14, 2025
బాపట్ల : డ్రగ్స్ అమ్ముతున్న మహిళ అరెస్ట్

డ్రగ్స్ విక్రయిస్తూ తప్పించుకు తిరుగుతున్న మహిళను వెదుళ్లపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. విజయలక్ష్మి యువకులకు డ్రగ్స్ బిల్లలు విక్రయిస్తూ పోలీసుల కళ్లు కప్పి తిరుగుతుండగా సోమవారం అరెస్ట్ చేశామన్నారు. స్టువర్టుపురం గ్రామంలోని ఓ ఇంట్లో ఉన్నట్లు సమాచారం రావడంతో.. ఆమెను అదుపులోకి తీసుకొని, కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు ఎస్సై భాగ్యరాజ్ తెలిపారు.
Similar News
News October 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 17, 2025
మామునూరు ఎయిర్పోర్టును నిధులు.. సీఎంను కలిసిన ఎంపీ

మమునూరు ఎయిర్ పోర్టుకు అదనంగా నిధులు కేటాయించడంపై సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ కడియం కావ్య కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్పోర్ట్ విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, రన్వే పొడిగింపు, లైటింగ్, సెక్యూరిటీ ఫెన్సింగ్ వంటి కీలక పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్ల నిధులను కేటాయించారు. WGL ప్రజల దీర్ఘకాల స్వప్నమైన మామునూరు విమానాశ్రయం త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభించబోతోందని ఎంపీ స్పష్టం చేశారు.
News October 17, 2025
‘ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నద్ధత కావాలి’

పార్వతీపురం జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజనులో ధాన్యం కొనుగోలుకు ఇప్పటినుంచే సన్నద్ధత కావాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్ల సంసిద్ధతపై గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజనులో రైతుల నుంచి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనాగా నిర్ణయించామన్నారు.