News February 27, 2026
బాపట్ల: డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిరంతర నిఘా

జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగే ప్రాంతాలపై బాపట్ల పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం తాగడం, గంజాయి వాడకం, పేకాట, ఈవ్‌టీజింగ్, దొంగతనాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సాంకేతికతను వినియోగించి జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
Similar News
News April 12, 2026
తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

తిరుపతి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే సోమవారం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అర్జీలు తీసుకుంటామని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీదారులు తమ వివరాలు, పాత స్లిప్పులు తీసుకు రావాలని సూచించారు. 1100కు కాల్ చేసి ఫిర్యాదుల స్టేటస్ తెలుసుకోవచ్చని చెప్పారు. Meekosam.ap.gov.in ద్వారానూ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
News April 12, 2026
నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.
News April 12, 2026
ఇంటర్ 2nd ఇయర్‌లో HYD-3లో ఇదీ పరిస్థితి!

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19630841>>HYD<<>>-3లో రెగ్యులర్ విద్యార్థులు 11673 మంది పరీక్షలు రాయగా 8521 మంది పాసై 73 శాతంతో స్టేట్‌లో 15వ ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 600 మందికి 473 మంది పాసై 78.83%తో 7వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 2274 మందికి 640 మంది పాసై 28.14%తో 30వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 48 మందికి 23 మంది పాసై 47.92%తో 24వ ప్లేస్ వచ్చింది.


