News February 4, 2025

బాపట్ల: నందిగం సురేశ్‌కు ధైర్యం చెప్పిన జగన్

image

విదేశీ పర్యటన ముగించుకొని మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ బాపట్ల మాజీ ఎంపీ నందింగం సురేశ్‌ను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కార్యక్రమంలో అంబటి, పేర్నినాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 15, 2025

జూబ్లీహిల్స్: ఏకాదశి.. ద్వాదశి.. నామినేషన్ వేయ్ మామా

image

వచ్చేనెల 11న జరిగే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రధాన పార్టీ క్యాండిడేట్స్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు విజయం కోసం తపిస్తున్నారు. ముఖ్యంగా ఏ రోజు నామినేషన్ వేస్తే కలిసొస్తుందనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు మంచిరోజులు (దశమి.. ఏకాదశి.. ద్వాదశి) ఉండటంతో తమకు అనుకూలమైన రోజు చూసుకొని నామినేషన్ వేయనున్నారు.

News October 15, 2025

జమ్మికుంట: అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు నేడే తుది గడువు

image

బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్‌ డిగ్రీ)లో దూరవిద్య ద్వారా BA, B.COM, B.Sc మొదటి సంవత్సరం ప్రవేశాలకు నేటితో తుది గడువు ముగుస్తుందని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ రమేష్‌ తెలిపారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించి, సాయంత్రంలోగా రసీదు అందించాలన్నారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు 7382929775 నంబరును సంప్రదించవచ్చు.

News October 15, 2025

లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డికి స్వల్ప ఊరట

image

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మిగతా నిందితులతో సంబంధం లేకుండా ఆయన బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ట్రయల్ కోర్టు మిగతా వారి బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దన్న హైకోర్టు తీర్పును చెవిరెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు.