News January 31, 2025
బాపట్ల: నకిలీ టాస్క్ ఫోర్స్ అధికారి వేషం గుట్టురట్టు

నకిలీ టాస్క్ ఫోర్స్ అధికారి వేషాన్ని బందరు తాలూకా పోలీసులు గుట్టురట్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల (D) రేపల్లె చీకటాయపాలెంకు చెందిన హోమ్ గార్డ్ సుమన్ బందర్లో ఓ వైన్ షాప్‌కి ఫోన్ చేసి టాస్క్ ఫోర్స్ అధికారిని డబ్బులు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని బెదిరించారు. దీంతో వైన్‌షాప్ అధికారి ఓసారి ఫోన్ పే చేసి మరోసారి అడగగా.. వచ్చి తీసుకోవాలని కోరాడు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Similar News
News October 22, 2025
పాల్వంచ: ఈనెల 24న జాబ్ మేళా..

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. టెక్నీషియన్, ట్రైనీ టెక్నీషియన్ పోస్టుల కోసం ఏదైనా డిగ్రీ లేదా ఐటీఐ చేసిన వారు అర్హులని చెప్పారు. 18 నుంచి 23 ఏళ్ల లోపు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యా అర్హత పత్రాలతో ఈనెల 24న ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు.
News October 22, 2025
థాంక్స్ చెబుతూనే మోదీ చురకలు!

దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పీఎం మోదీ <<18069464>>థాంక్స్ చెప్పిన <<>>విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధన్యవాదాలు చెబుతూనే ట్రంప్‌కు చురకలు అంటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఐక్యంగా వ్యతిరేకించాలంటూ ప్రధాని హితవుపలికారు. పాక్‌ను ట్రంప్ సపోర్ట్ చేస్తుండటాన్ని పరోక్షంగా గుర్తు చేశారని, ఇదే సమయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
News October 22, 2025
తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సూచనలు

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాగులు పొంగే చోట అధికారులు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.