News February 4, 2025
బాపట్ల: నగ్న చిత్రాల పేరుతో రూ.2.53 కోట్లు స్వాహా.. అరెస్ట్

అశ్లీల వీడియోల పేరుతో బెదిరించి తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన దేవనాయక్ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు నిడదవోలు సీఐ తిలక్ సోమవారం తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. తన వద్ద యువతి నగ్న చిత్రాలు ఉన్నాయని వాటిని ఇంటర్నెట్లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. నిందితుడి నుంచి రూ. 1.84 కోట్లు నగదు, ఆస్తులను సీజ్ చేశామన్నారు.
Similar News
News October 15, 2025
ప్రకాశం జిల్లాలో 38,866 ఎకరాల భూమి.. ఆలయాల పరిధిలోనే!

జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దేవదాయ శాఖ అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ ఏసీ పానకాలరావు మాట్లాడుతూ.. జిల్లాలో దేవదాయ శాఖ పరిధికి సంబంధించి 1001 దేవాలయాలు ఉన్నాయని, వీటి పరిధిలో 38,866.95 ఎకరాల భూమి ఉందన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.
News October 15, 2025
కొత్తగూడెం: కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయాలి

వానాకాలం ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
News October 15, 2025
కామారెడ్డి: ‘ఏకాభిప్రాయంతో DCC అధ్యక్షుడి నియామకం’

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. AICC అబ్జర్వర్ రాజ్ పాల్ కరోలా హాజరయ్యారు. ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తూ డీసీసీ అధ్యక్షులను పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు. సీనియారిటీ, పార్టీ పట్ల నిబద్ధత తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు. ఏకాభిప్రాయంతో DCC అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు.