News March 25, 2025
బాపట్ల: ‘నా కొడుకు చంపాలని చూస్తున్నాడు’

ఆస్తిరాయించుకొని తన కొడుకు తనను చంపాలనుకుంటున్నాడని సయ్యద్ కరిమూన్, బొప్పుడి బాపట్ల SP వద్ద వాపోయారు. ‘నాకు ఇద్దరు మగపిల్లలు, ఒకమ్మాయి. పెద్ద కొడుకు చనిపోయాడు. నా చిన్నకొడుకు సయ్యద్ మోహిద్దీన్, కోడలు నజీమూన్లు ఆస్తీ మొత్తం తీసుకుని నన్ను, నా భర్తను చంపాలని చూశారు. దీంతో నాభర్త భయంతో పారిపోయాడు. నేను ప్రాణభయంతో వేటపాలెంలోని నా కూతరు వద్ద ఉన్నా, నన్ను కాపాడండి’ అని వేడుకున్నారు.
Similar News
News November 21, 2025
పెద్దపల్లి: ఐపీఎస్ అధికారి బి.రామ్ రెడ్డి బదిలీ

సీఐడీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. రామ్ రెడ్డి, ఐపీఎస్ (2020) బదిలీ అయ్యారు. ఆయన్ను రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో ఉన్న శ్రీ పి. కరుణాకర్, ఎస్పీ (ఎన్సీ) బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
News November 21, 2025
సంక్షేమ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: MNCL కలెక్టర్

వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్ ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. వయోవృద్ధుల దరఖాస్తులను పోలీసు, రెవెన్యూ సిబ్బంది సానుకూల దృక్పథంతో చూడాలని సూచించారు.
News November 21, 2025
MNCL:ఈనెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు

ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల23న ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల వాలీబాల్ ఎంపికపోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆదిలాబాద్‌లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈపోటీల్లో ఎంపికైనవారు సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.


