News January 27, 2025
బాపట్ల: నూతన కలెక్టరేట్కు స్థల పరిశీలన

నూతన కలెక్టరేట్ నిర్మించడానికి స్థలాలు పరిశీలిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. సోమవారం బాపట్ల పట్టణంలో నూతన కలెక్టరేట్కు ప్రతిపాదిత స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. త్వరలోనే స్థలం సేకరించి నూతన కలెక్టరేట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 22, 2025
తిరుమల దర్శనాలపై TTD కీలక ప్రకటన

తిరుమల వైకుంఠద్వార దర్శనాలకు డిసెంబర్ 30, 31, జనవరి 1న ఆన్లైన్లో టికెట్లు పొందిన వాళ్లనే అనుమతిస్తారు. ఉదయం స్లాట్ల భక్తులు కృష్ణతేజ సర్కిల్ నుంచి, మధ్యాహ్నం స్లాట్ల భక్తులు ATGH నుంచి, రాత్రి స్లాట్ల భక్తులు శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతిస్తామని TTD తెలిపింది. టోకెన్ లేని భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవు. టోకెన్, ఆధార్ కార్డులతో స్లాట్ సమయానికి భక్తులు రావాలని పోలీసులు కోరారు.
News December 22, 2025
కొత్త పథకాలపై ప్రభుత్వం కసరత్తు

TG: వచ్చే బడ్జెట్లో మరో 5 కొత్త పథకాలను ప్రకటించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలను రప్పిస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేయిస్తోంది. ఈ పథకాలకు ఆర్థిక వనరుల లభ్యతపై ఆర్థిక శాఖ కసరత్తు చేపట్టింది. కాగా ఎన్నికల హామీ అయిన పెన్షన్ పెంపుపై ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 22, 2025
MDK: పెన్షన్ల పెంపుకు ఎదురుచూపులు ఎన్నాళ్లో!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఎన్నికల హామీ మేరకు పింఛన్ల పెంపుపై స్పష్టత రాకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు ఇస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,69,575 మంది పింఛన్ దారులు పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి హామీని నెరవేర్చాలని కోరుతున్నారు.


