News April 3, 2025
బాపట్ల పట్టణంలో క్రైస్తవుల శాంతియుత ర్యాలీ

పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల క్రైస్తవ సంఘాలు నిరసన తెలియజేశాయి. బుధవారం బాపట్ల పట్టణంలో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ వద్ద బైఠాయించారు. ప్రవీణ్ మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి వారి కుటుంబానికి న్యాయం చేయాలని మృతి పై గల అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News April 8, 2025
మెగా DSC.. మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

AP: విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. DSC, టెన్త్, ఇంటర్ ఫలితాలతో పాటు పలు అంశాలపై సమీక్షించారు. రాబోయే 4ఏళ్లు విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాలన్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా వీలైనంత త్వరగా DSC ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెన్త్, ఇంటర్ ఫలితాల ప్రకటన విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News April 8, 2025
మోమిన్పేట్: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండి గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూచించారు. మంగళవారం మోమిన్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలను మందులను జిల్లా వైద్యాధికారి వెంకటరమణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 8, 2025
KG రైస్‌కు రూ.43 ఖర్చు.. రూ.10కి అమ్ముకోవడం దారుణం: నాదెండ్ల

AP: సన్నబియ్యం విషయంలో తెలంగాణతో పోటీపడబోమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అందించేది నాణ్యమైన బియ్యమని అందుకుగాను KG రైస్‌కు రూ.43 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ మెుత్తంలో కేంద్రం 61, రాష్ట్రం 39శాతం భరిస్తోందని పేర్కొన్నారు. ఇంత ఖర్చుచేసి పేదలకు బియ్యం అందిస్తుంటే వాటిని రూ.10కి అమ్ముకోవడం దారుణమన్నారు. బియ్యం రీ సైక్లింగ్ కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.