News February 14, 2025

బాపట్ల: ‘పరిశ్రమలకై ఔత్సాహికులను ప్రోత్సహించాలి’

image

పరిశ్రమల స్థాపన కొరకు ఔత్సాహికులను మరింత ప్రోత్సహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక, అభివృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జరిగింది. బాపట్ల జిల్లాలోని వివిధ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అవుతున్న వస్తువులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 18, 2025

NRML: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు 6 రోజులు జైలు: ఎస్పీ

image

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా.జి.జానకి షర్మిల హెచ్చరించారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన షేక్ ఆయుబ్‌ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడగా, అతనికి న్యాయమూర్తి నర్సయ్య 6 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.

ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

image

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>