News February 14, 2025
బాపట్ల: ‘పరిశ్రమలకై ఔత్సాహికులను ప్రోత్సహించాలి’

పరిశ్రమల స్థాపన కొరకు ఔత్సాహికులను మరింత ప్రోత్సహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక, అభివృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జరిగింది. బాపట్ల జిల్లాలోని వివిధ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అవుతున్న వస్తువులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News March 23, 2025
కరీంనగర్: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
News March 23, 2025
ఐనవోలులో భారీ పోలీస్ బందోబస్తు

పెద్ద పట్నం సందర్భంగా ఐనవోలు మల్లికార్జున ఆలయంలో ఆదివారం జరిగే జాతరను సజావుగా నిర్వహించేందుకు పర్వతగిరి సీఐ రాజగోపాల్ పర్యవేక్షణలో ఐనవోలు ఎస్ఐ శ్రీనివాస్ స్థానిక పోలీసులు, ప్రత్యేక పోలీసులతో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్, చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పెద్ద పట్నం జాతరకు హాజరవుతారు.
News March 23, 2025
సిరిసిల్ల: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం