News February 21, 2025
బాపట్ల: ‘పరీక్షలను సజావుగా నిర్వహించాలి’

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, పి 4 సర్వే, ఎం.ఎస్.ఎం.ఇ సర్వే, వాట్సాప్ గవర్నెన్స్‌పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల జిల్లా వెంకట మురళీ పాల్గొన్నారు.
Similar News
News February 23, 2025
‘ఎంత పని చేశావ్‌రా నా కొడకా’ అంటూ సుహాస్ ఎమోషన్ పోస్ట్

తన ప్రాణ స్నేహితుడు మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ హీరో సుహాస్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘అసలేమైందో నాకు కరెక్ట్‌గా తెలియదు. కానీ వాడు చాలా సంతోషంగా ఉండేవాడు. ధైర్యవంతుడు కూడా. కానీ ఇప్పుడు ఇలా.. ఎంత పని చేశావ్‌రా నా కొడకా’ అని రాసుకొచ్చి బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు. తన ఫ్రెండ్‌తో సరదాగా దిగిన ఫొటోలను షేర్ చేశారు.
News February 23, 2025
సత్యసాయి: HNSS ఫేస్-2 కాలువ మ్యాప్ పరిశీలన

హంద్రీనీవా సుజల స్రవంతి ఫేస్-2 సంబంధించిన కాలువ మ్యాప్‌ను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లో హంద్రీనీవా సుజల స్రవంతి అధికారులు, 2వ విడతలో చేపట్టాల్సిన పనుల గురించి మ్యాప్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఫేస్-2 పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
News February 23, 2025
ADB: విద్యార్థులకు అలర్ట్.. మోడల్ స్కూల్ దరఖాస్తులు

2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్‌లలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని బోథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు (మిగిలిన సీట్లకు) దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తారీకు చివరి తేదీ అన్నారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 13న ఉంటుందన్నారు. పరీక్ష ఫీజు SC, ST, BC, PHC& EWSలకు రూ.125, OC విద్యార్థులకు రూ.200 ఉంటుందన్నారు.