News December 6, 2024
బాపట్ల పాఠశాల యాజమాన్యానికి లోకేశ్ ధన్యవాదాలు

బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించినందుకు మంత్రి లోకేశ్ యాజమాన్య కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. మెగా పీటీఎంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. విద్యా శాఖలో విప్లవాత్మక మార్పులకు ఈ డిజిటల్ ఇన్విటేషన్లు ఓ ఉదాహరణ. అని ట్వీట్ చేశారు. లక్షలాది మంది పూర్వ విద్యార్థులతో పండుగ వాతావరణంలో Mega PTM జరుపుదామని చెప్పారు.
Similar News
News December 13, 2025
నేడు తుళ్లూరులో ఎంపీ పెమ్మసాని పర్యటన

తుళ్లూరు మండలంలో శనివారం కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో అమరావతి అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తుళ్లూరులోని మేరీమాత స్కూల్లో “నయీ చేతన” కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.
News December 12, 2025
కాకుమాను: సివిల్ సప్లైస్ డైరెక్టర్‌గా నక్కల ఆగస్టీన్

కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత నక్కల ఆగస్టీన్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు ఆగస్టీన్ ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టీన్ నియామకంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
News December 12, 2025
గుంటూరు: వైసీపీ మీడియా ప్యానలిస్టులు వీరే.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నూతన మీడియా ప్యానలిస్టులను నియమించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఈ జాబితాలో అవకాశం దక్కింది. ఆవుతు శ్రీధర్, షేక్ మహబూబ్ షరీఫ్‌ను హిందీ ఛానెల్స్ ప్యానలిస్ట్‌గా నియమించారు. వీరు పార్టీ తరఫున మీడియాలో వాణి వినిపించనున్నారు.


