News March 11, 2025
బాపట్ల పీజీఆర్ఎస్కు 89 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 89 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.
Similar News
News March 11, 2025
అవనిగడ్డ: రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించిన కలెక్టర్

అవనిగడ్డ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్ను శుభ్రపరచడం, క్లోరినేషన్ చేసిన తేదీలను సంబంధిత రిజిస్టర్లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా ట్యాంక్ను శుభ్రపరిచి ప్రజలకు మంచినీటిని అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి సూచించారు.
News March 11, 2025
బిక్కనూర్: ‘గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు వేగవంతం చేయాలి’

బిక్కనూర్ మండలంలోని అన్ని గ్రామాలలో దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటును వేగవంతం చేయాలని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల పోలీస్ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, ఎస్ఐలు ఆంజనేయులు, పుష్పరాజ్, స్రవంతి, ప్రభాకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News March 11, 2025
పిట్లం: ‘Way2 News’ కథనానికి స్పందన..!

పిట్లం వాసి మిర్యాల చిరంజీవి కొడుకు అరవింద్(12) చిన్న వయస్సులోనే రెండు కిడ్నీలు చెడిపోవడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మందుల కోసం ఇప్పటికీ రూ.2.50 లక్షలు ఖర్చయింది. <<15721677>>’బాలుడికి కిడ్నీ సమస్య.. సాయం కోసం ఎదురుచూపులు’<<>> అనే శీర్షికతో Way2Newsలో ఇవాళ కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాలుడి వివరాలు సేకరించి CMRF పథకం ద్వారా సాయం అందేలా చూస్తామన్నారు.