News March 11, 2025
బాపట్ల పీజీఆర్‌ఎస్‌కు 89 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 89 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.
Similar News
News March 22, 2025
నిర్మల్: బీఆర్ఎస్ నేతల అరెస్ట్

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని పలు మండలాల బీఆర్ఎస్ నేతలను శనివారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీలను పూర్తిగా మాఫీ చేయలేదన్నారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ఇవ్వడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
News March 22, 2025
MBNR: నేటి నుంచి ఐపీఎల్ షురూ.. జర జాగ్రత్త గురూ!

ఐపీఎల్ అంటేనే ఏమా క్రేజ్. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ పై బెట్టింగ్ పెడుతూ యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతేడాది పలువురు బెట్టింగ్ రాయుళ్లపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ పై మోజు పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.బెట్టింగ్ అని వచ్చే వారితో యువత జాగ్రత్తగా ఉండాలని, సమాచారం ఇవ్వాలన్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News March 22, 2025
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,170 మంది భక్తులు దర్శించుకోగా 26,821 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు సమకూరింది.