News March 10, 2025
బాపట్ల పీజీఆర్ఎస్కు 89 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 89 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.
Similar News
News March 24, 2025
వనపర్తి: ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మాలలకు తీరని అన్యాయం’

రాష్ట్రంలో గత 20 సంవత్సరాల నుంచి మాలలకు సంక్షేమ పథకాల్లో, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్‌లో తీరని అన్యాయం జరిగిందని ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాదారి భోజరాజు అన్నారు. మాలలకు ప్రతి సంక్షేమ పథకంలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికు వినతి పత్రం అందించారు. మద్దిలేటి వెంకటేశ్, కురుమూర్తి, కరుణాకర్ పాల్గొన్నారు.
News March 24, 2025
సింహాచలం అప్పన్న పెండ్లిరాట ఎప్పుడంటే?

సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి అనగా వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పెండ్లిరాట మహోత్సవాన్ని ఉగాది పర్వదినాన జనపనున్నారు. ఈనెల 30వ తేదీన సాయంత్రం సుముహూర్త సమయంలో పెండ్లిరాటను వేస్తారు. మండపంలో మధ్యాహ్నం నూతన పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఈ పెండ్లిరాట మహోత్సవాన్ని నిర్వహిస్తారు.
News March 24, 2025
క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఈసీజీ, తదితర స్కానింగ్స్ చేయించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.