News January 27, 2025

బాపట్ల పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 51 అర్జీలు

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా ఎస్పీ తుషార్ డూడి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 51 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో తెలుపవచ్చని ఎస్పీ అన్నారు.

Similar News

News December 4, 2025

తుంగతుర్తి: సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా

image

తుంగతుర్తి నుంచి సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సంకినేని వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన 1988 నుంచి 1995 వరకు తుంగతుర్తి గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ తరపున తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2014, 2018, 2023 ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.

News December 4, 2025

సూర్యాపేట: ఏడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం

image

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. సర్పంచ్ పదవులకు 471 మంది, వార్డులకు 2,736 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఏడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అవి కాకుండా 193 వార్డుల స్థానాలకు ఒకటే నామినేషన్ ఉండడంతో ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తులతో అభ్యర్థులు గురువారం నుంచి ప్రచారానికి వెళ్లనున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది.

News December 4, 2025

OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

image

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.