News February 28, 2025
బాపట్ల: ‘పెన్షన్‌దారులతో మర్యాదగా ఉండాలి’

పెన్షన్‌దారులతో మర్యాద పూర్వకంగా ఉండాలని, పెన్షన్ పంపిణీ సిబ్బంది కొత్త యాప్ డౌన్ లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. పెన్షన్ పంపిణీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించాలన్నారు. శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జిల్లా అధికారులతో కలిసి కె. విజయానంద్ నిర్వహించిన వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
Similar News
News March 1, 2025
నేటి నుంచి EAPCET దరఖాస్తుల స్వీకరణ

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే EAP-CET దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 4వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ దీన్‌కుమార్ తెలిపారు. గతనెల 25నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా 15% నాన్-లోకల్ కన్వీనర్ కోటా అంశంపై స్పష్టత కోసం ప్రభుత్వం వాయిదా వేసింది. నిన్న దీనిపై <<15604020>>నిర్ణయం<<>> తీసుకోగా నేటి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది.
News March 1, 2025
వార్షిక బడ్జెట్‌లో విజయవాడ మెట్రోకు రూ.50కోట్లు

వార్షిక బడ్జెట్‌లో విజయవాడ మెట్రో నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించింది. కాగా మెట్రో పూర్తిచేసేందుకు కేంద్రం 100% భరించేలా గతంలో రాష్ట్రం ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనపై కేంద్రం అధికారిక ప్రకటన ఇచ్చినట్లయితే రాష్ట్రం నుంచి మరిన్ని నిధుల కేటాయింపుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం విజయవాడ మెట్రోపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
News March 1, 2025
కరీంనగర్: ఫుట్ పాత్‌పై గుర్తుతెలియని వృద్ధుడి మృతి

కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి ముందు ఫుట్ పాత్‌పై గుర్తుతెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా ఫుట్ పాత్ పైనే ఉంటున్న వృద్ధుడు, అనారోగ్యంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడిని ఎవరైనా గుర్తుపడితే కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.