News March 28, 2025
బాపట్ల: ‘పొగాకు రైతులకి న్యాయం చేయాలి’

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పొగా రైతులు, వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పలువురు రైతులు ప్రజా పరిష్కార వేదిక వద్ద బర్లీ పొగాకు రైతులకి న్యాయం చేయాలని, పంటను కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు.
Similar News
News April 4, 2025
వాసుదేవరెడ్డి రిలీవ్

AP: లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న APSBCL మాజీ ఎండీ వాసుదేవరెడ్డి రాష్ట్రం నుంచి రిలీవ్ అయ్యారు. రైల్వే శాఖలో ఉన్న ఆయన 2019 AUGలో డిప్యుటేషన్‌పై APకి వచ్చారు. గతేడాది AUG 25తో గడువు ముగిసింది. అయితే మద్యం కేసు కారణంగా ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. రైల్వే బోర్డు సమ్మతితో FEB 25 వరకు డిప్యుటేషన్‌ను పొడిగించింది. మళ్లీ పొడిగింపునకు రైల్వే నిరాకరించడంతో తక్షణమే రిలీవ్ చేస్తూ ఆదేశాలిచ్చింది.
News April 4, 2025
ఖమ్మం జిల్లాలో TODAY ముఖ్యాంశాలు

∆} ఖమ్మం: చెల్లని చెక్కు కేసులో 6నెలల జైలు శిక్ష.. ∆} ఖమ్మం: సన్న బియ్యం పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం: బీజేపీ ∆} HCU భూములపై రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి ∆} కామేపల్లి: అమ్మాయి పుడితే పండగ చేసుకోవాలి: ఖమ్మం కలెక్టర్ ∆} ఖమ్మంలో జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ యాత్ర ∆} ఖమ్మం: సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి: తుమ్మల ∆}KMM: తలతాకట్టు పెట్టెనా పథకాలు అమలు చేస్తాం: పొంగులేటి.
News April 4, 2025
సుప్రీం కోర్టుకు వందనాలు: ఆర్ఎస్పీ

గచ్చిబౌలిలో ‘వనమేధాన్ని’ అడ్డుకున్న సుప్రీం కోర్టుకు వందనాలు అంటూ పాలమూరు BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Xలో ట్వీట్ చేశారు. HCU విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. అబద్ధాల ఆక్సిజన్‌తో, పోలీసుల పహారాలో, ప్రజల నుంచి దూరంగా తమ బంగళాల్లో సేద తీరుతున్న రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి, కొండా సురేఖ తదితరులు వెంటనే రాజీనామా చేయాలన్నారు.