News March 16, 2025
బాపట్ల: పొట్టి శ్రీరాములకు ఘన నివాళి

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
వామ్మో.. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40వేలు

వందల సంఖ్యలో ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో దేశీయ విమాన టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఢిల్లీ టు లండన్ టికెట్ ధర రూ.25వేలు ఉంటే ఢిల్లీ టు కొచ్చి టికెట్ ఫేర్ ఏకంగా రూ.40వేలకు పెంచేశారు. ఇది సాధారణంగా రూ.5,000-రూ.10,000 మధ్య ఉంటుంది. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40,452కు ఎగబాకింది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రేట్లు పెంచవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
News December 5, 2025
ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో గర్భిణులకు తప్పని ప్రైవేటు బాట

ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.30 లక్షల విలువైన టిఫా స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు ఏడదిన్నరగా రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఈ కీలక సేవలు అందడం లేదు. శిశువు ఎదుగుదల తెలుసుకోవాల్సిన గర్భిణులు చేసేది లేక రూ.4,000 వరకు చెల్లించి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్‌ను నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.
News December 5, 2025
సిరిసిల్ల: గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి

సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ సర్పంచ్ అభ్యర్థి చర్ల మురళి(51) గుండెపోటుతో మృతి చెందారు. బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఆయనకు గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయణ్ను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, గుండెపోటు తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు.


