News April 8, 2025

బాపట్ల: ప్రభుత్వ లక్ష్యాలకు సిబ్బంది కృషిచేయాలి- కలెక్టర్

image

ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 వేల కుటుంబాలకు పాడి పశువులను అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించారని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News September 17, 2025

చిత్తూరు జిల్లా పర్యాటక అధికారిగా నరేంద్ర

image

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ ఏఎం నరేంద్రకు కీలక పదవి లభించింది. ఆయనను పర్యాటక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టూరిజం రంగంపై నరేంద్ర ఇప్పటివరకు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని అనేక శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు. విద్యారంగంలో విశేష అనుభవంతో పాటు సామాజిక రంగంలోనూ ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమించింది.

News September 17, 2025

చాకలి ఐలమ్మ స్ఫూర్తి యోధులు వీరే..!

image

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మరికొందరు పోరాట యోధులు ఆమె పోరాట శైలిని స్ఫూర్తిగా తీసుకొని సాయుధ పోరాటంలో ఉద్యమించి ప్రాణాలర్పించారు. వారే పాలకుర్తికి చెందిన జీడి సోమయ్య, చాకలి సోమయ్య, మామిండ్ల ఐలయ్య, ఆకుల వెంకటయ్య, కమ్మరి బ్రహ్మయ్య, చుక్కా సోమయ్య, జీడి బాలయ్య, జీడి కొమురయ్య, వీరమనేని రామచంద్రయ్య తదితరులు ఉన్నారు.

News September 17, 2025

దేశవ్యాప్తంగా 16చోట్ల NIA సోదాలు

image

AP: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో NIA మరోసారి తనిఖీలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, UP, ఝార్ఖండ్, బిహార్, ఢిల్లీ, మహారాష్ట్రలో మొత్తం 16చోట్ల సోదాలు చేసింది. ఏపీలో నిర్వహించిన సోదాల్లో డిజిటల్ పరికరాలు, నగదు, అనుమానాస్పద వస్తువులు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. జులై నెల VZMలో సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను NIA అరెస్టు చేయగా.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్ర పన్నినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.