News February 25, 2026
బాపట్ల: ఫుల్లుగా తాగి బీరు బాటిల్‌తో దాడి

విజయవాడలో మద్యం మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. చీరాలకు చెందిన ప్రసాద్ అనే ఎలక్ట్రీషియన్ పనుల నిమిత్తం ఇక్కడ గదిని అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం ఇంటి యజమాని బంధువైన షౌకత్ అలీ ఖాన్ అక్కడికి వచ్చి, మా మేనత్త ఇంట్లో నువ్వెందుకు ఉంటున్నావు అంటూ గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న షౌకత్, ప్రసాద్‌పై బీరు సీసాతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 14, 2026
విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ప్రత్యేక డిస్కమ్ హోదా

విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్‌కు ‘డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్’ హోదా ఇవ్వనుంది. దీనిపై త్వరలో అధికారిక GO వెలువడనుంది. ఈ హోదాతో గూగుల్ స్వయంగా విద్యుత్ కొనుగోలు చేసి పంపిణీ చేసుకునే అవకాశం పొందుతుంది. స్థానిక వినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
News April 14, 2026
GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

సీఎం చంద్రబాబు మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో జరిగే అంబేడ్కర్ జయంతి వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.40 గంటలకు SRM యూనివర్సిటీకి బయలుదేరి వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటలకు నూతనంగా ఏర్పాటు చేసిన క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఆయన తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.
News April 14, 2026
కరీంనగర్‌లో అంబేడ్కర్ జయంతి.. వాహనాల మళ్లింపు

KNRలో అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని CP గౌస్ ఆలం తెలిపారు. JGTL నుంచి వచ్చే భారీ వాహనాలను రేకుర్తి, SU, పద్మనగర్, రాంనగర్, తెలంగాణ చౌక్ మీదుగా మళ్లించనున్నామన్నారు. పెద్దపల్లి నుంచి వచ్చే భారీ వాహనాలు బొమ్మకల్ బైపాస్ నుంచి వెళ్లాలని, ప్రధాన కూడళ్లలో జనం రద్దీ దృష్ట్యా వాహనదారులు పోలీసులకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు.


