News February 27, 2026
బాపట్ల: బడ్జెట్ పేరిట అధిక వసూళ్లు..?

బాపట్ల జిల్లాలో సిగరెట్ల ధరల విషయంలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ పేరిట ధరలు పెరిగిన నేపథ్యంలో వ్యాపారులు పాత MRP ముద్రించిన సిగరెట్లను కూడా కొత్త ధరలకు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీంతో ఖచ్చితమైన ధరపై స్పష్టత లేక స్మోకర్స్ అయోమయంలో పడుతున్నారు. సంబంధిత అధికారులు దాడులు నిర్వహించి MRP ధరలకే వాటిని విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News April 16, 2026
తెలంగాణ యూనివర్సిటీ నూతన పాలకమండలి నియామకం

తెలంగాణ యూనివర్సిటీకి ప్రభుత్వం నూతన పాలకమండలిని నియమించింది. ప్రొ.ఆంజనేయులు, అసోసియేట్ ప్రొఫెసర్ డా.సుధాకర్ గౌడ్, డా.సంజీవరావు, డా.స్వామి, ప్రొఫెసర్ మదన్మోహన్, పలు సామాజిక విభాగాల నుంచి చెరుకూరి రజినీకాంత్, అల్లే లావణ్య, మహమ్మద్ ఘాజి, డాక్టర్ జయంత్‌లను సెలెక్ట్ చేశారు.
News April 16, 2026
HMTలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

కాంట్రాక్ట్ పద్ధతిలో 2 డిప్యూటీ ఇంజినీర్, 2 ఆఫీసర్ పోస్టుల భర్తీకి HMT దరఖాస్తులను కోరుతోంది. మెకానికల్/ప్రొడక్షన్‌లో 60% మార్కులతో ఇంజినీరింగ్ పూర్తిచేసి రెండేళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. జీతం నెలకు రూ.16,400-రూ. 40,500. వయసు 30 ఏళ్లు దాటకూడదు. ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి APR-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు www.hmtindia.com చూడండి.
News April 16, 2026
రాంగ్ రూట్‌లో వస్తే వాహనాలను సీజ్ చేయాలి: కలెక్టర్

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాంగ్ రూట్ ప్రయాణాలపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో జరిగిన రోడ్డు భద్రత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రేడియం పెయింటింగ్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.


